: పుట్టింగళ్ ఘటన... 110 మంది మరణానికి కారణమైన 43 మందికి కేరళ హైకోర్టు బెయిల్


దాదాపు మూడు నెలల క్రితం కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో పుట్టింగళ్ దేవీ ఆలయంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం గుర్తుందిగా? ఈ ఘటనలో 110 మంది చనిపోగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు 43 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇప్పుడు వీరందరికీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇంతటి ఘోర ప్రమాదంలో దర్యాప్తును త్వరితగతిని ముగించలేకపోయిన పోలీసుల నిర్లక్ష్యమే వీరికి బెయిల్ లభించేలా చేసింది. 90 రోజుల్లోపు చార్జ్ షీట్ ను దాఖలు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో నిందితులందరికీ బెయిల్ ను మంజూరు చేస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఏప్రిల్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆలయ ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా కాలుస్తుండగా, నిప్పురవ్వలు, బాణసంచా నిల్వలపై పడి మంటలు ఎగసిపడ్డాయి. బాణసంచా కాల్చిన వారు, ఆలయ ట్రస్ట్ అధికారులు తదితరులపై కేసులు పెట్టగా, వారందరికీ బెయిల్ లభించింది.

  • Loading...

More Telugu News