: ఎవ్వరినీ వదిలిపెట్టం... ఓసీలను బీసీలుగా మారుస్తున్న దందాపై కామినేని
లక్షల రూపాయలు తీసుకుని ఓసీలను వెనుకబడిన వర్గాలకు చెందిన వారిగా చూపుతూ, కళాశాలల్లో ప్రవేశం ఇప్పిస్తున్నారన్న కథనాలపై మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ఎంబీబీఎస్ సీట్ల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సీట్ల దందా, కులాల మార్పు వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. వెంటనే విచారణకు ఆదేశిస్తున్నామని పేర్కొన్నారు. గత సంవత్సరం కర్నూలు జిల్లాలో ఇదే విధమైన ఆరోపణలు వచ్చాయని, అప్పట్లో నిజాలను వెలికితీసి కేసులు పెట్టి, విద్యార్థుల తల్లిదండ్రులను సైతం అరెస్ట్ చేశామని గుర్తు చేశారు.