: ‘నేషనల్ హెరాల్డ్’ మళ్లీ వస్తోంది.. పున:ప్రారంభానికి కాంగ్రెస్ సన్నాహాలు


దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రజల ముంగిటకు వచ్చేందుకు ‘నేషనల్ హెరల్డ్’ దినపత్రిక సిద్ధమవుతోంది. 1938లో లక్నోలో జవహర్‌లాల్ నెహ్రూ దీనిని ప్రారంభించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ పాలకులు దీనిని నిషేధించారు. ఆ తర్వాత మరోమారు 1940, 70లలో మూతపడింది. అనంతరం తెరుచుకున్నా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడింది. చివరికి పూర్తిగా సంక్షోభంలో చిక్కుకోవడంతో ఎనిమిదేళ్ల క్రితం మూతపడింది. ప్రస్తుతం అధికారం లేక డీలా పడిన కాంగ్రెస్ పార్టీ తిరిగి పేపర్‌ను పున:ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. వచ్చేవారమే ఇది ప్రజల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఖువామీ ఆజాద్(ఉర్దూ), నవజీవన్(హిందీ) పేపర్లను కూడా రీలాంచ్ చేయనున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎడిటర్ పేరును కూడా ఖరారు చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, పేపర్లను పబ్లిష్ చేసే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) సీఎండీ మోతీలాల్ వోరా మాట్లాడుతూ ఈ మూడు పేపర్లను తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. జనవరిలోనే ఈమేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎడిటర్ల పేర్లు దాదాపు ఖరారైనట్టు పేర్కొన్నారు మరికొద్ది రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నట్టు వివరించారు. అధికారిక పేపరు లేక అల్లాడిపోతున్న ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ’కి ఈ పేపర్లు ఏమాత్రం మేలు చేస్తాయో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News