: కశ్మీర్‌లో పాక్ అనుకూల నినాదాలు... భారత్‌కు వ్యతిరేకంగా జిహాద్‌లో పాల్గొనాలని పిలుపు


జమ్ముకశ్మీర్‌లో మరోమారు పాకిస్థాన్ అనుకూల నినాదాలు వినిపించాయి. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ ముజఫర్ వనీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కశ్మీర్‌లో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. వనీ అంత్యక్రియల సందర్భంగా రెచ్చిపోయిన ఆందోళకారులు విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో ఆదివారం పోలీసు డ్రైవర్ సహా ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 22కు చేరుకుంది. కాగా కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మసీదుల్లోని లౌడ్ స్పీకర్లు భారత్‌ వ్యతిరేక నినాదాలతో హోరెత్తాయి. భారత్‌కు వ్యతిరేకంగా ‘యాంటీ ఇండియా జిహాద్’లో పాల్గొనాలని యువతను ప్రేరేపించాయి. భద్రతా దళాలతో పోరాడేందుకు యువత సిద్ధం కావాలని నినదించాయి. జిహాద్ ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని పేర్కొంటూ లౌడ్ స్పీకర్లలో రికార్డులు ప్లే చేయడం ఇటీవల అక్కడ సర్వ సాధారణం అయింది. పాకిస్థాన్‌తో సంబంధాలున్న వ్యక్తుల వద్ద ఇటువంటి ‘మెటీరియల్’ ఉంటోందని, ఆందోళనలు జరిగినప్పుడు దానిని బయటకు తీసి యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News