: ఎన్టీఆర్ వీరాభిమాని శ్రీపతిరాజేశ్వర్ కన్నుమూత


ఎన్టీఆర్ వీరాభిమాని, మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్(73) అనారోగ్యం కారణంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. మూత్రపిండాల వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా సేవలందించిన రాజేశ్వరరావు 60 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించడమే కాకుండా, దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించక ముందు నుంచీ ఆయనతో శ్రీపతికి అనుబంధం ఉంది.

  • Loading...

More Telugu News