: కాశ్మీర్ లో పోలీస్ వాహనాన్ని నదిలోకి తోసేసిన ఆందోళనకారులు
కాశ్మీర్ లోయలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. అనంత్ నాగ్ జిల్లాలో కొందరు ఆందోళనకారులు పోలీసు వాహనాన్ని జీలం నదిలోకి తోసేశారు. ఈ సంఘటనలో ఒక పోలీసు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, కాశ్మీర్ లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ నేపథ్యంలో నిన్న అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పుబెట్టిన ఘటనలో సుమారు 16 మంది మృతి చెందారు.