: రష్యా హెలికాఫ్టర్ ను గాల్లోనే పేల్చేసిన ఐఎస్ ఉగ్రవాదులు
ఐఎస్ ఉగ్రవాదుల ఘాతుకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా, రష్యాకు చెందిన హెలికాఫ్టర్ ను గాల్లోనే వారు పేల్చివేశారు. సిరియాలోని పామిరా ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు పైలెట్లు చనిపోయారు. హామ్స్ అనే ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించే క్రమంలో భాగంగా మిగ్-25 హెలికాఫ్టర్ అక్కడ ఎగురుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. హెలికాఫ్టర్ వెనుక భాగానికి నిప్పంటుకుని కుప్పకూలిపోయిన అనంతరం భారీ శబ్దంతో పేలిపోయింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.