: చంద్రబాబుపై కాంగ్రెస్ నేత రామచంద్రయ్య తీవ్ర వ్యాఖ్యలు


బీసీలు, కాపుల మధ్య నిప్పు పెట్టాలని చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ అగ్గే దహించివేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో రైతులు బాధలు పడుతుంటే, రాజధాని నిర్మాణం బాగా జరుగుతోందని గవర్నర్ నరసింహన్ ఎలా అంటారంటూ ఆయన మండిపడ్డారు. రైతుల బాధలు గవర్నర్ కు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపులపై గవర్నర్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మెప్పు కోసమే గవర్నర్ పనిచేస్తున్నారని రామచంద్రయ్య ఆరోపించారు.

  • Loading...

More Telugu News