: మెగాస్టార్ చిరంజీవి సందేశాలిస్తే ఇప్పటి ప్రేక్షకులు చూడరు: దర్శకుడు కోదండరామిరెడ్డి
మెగాస్టార్ చిరంజీవి సందేశాలిస్తే ఇప్పటి ప్రేక్షకులు చూడరని నాటి ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. విజయవాడలో రోటరీ క్లబ్ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, 'ఏదో చేస్తానని చిరంజీవి అంటే ప్రేక్షకులు నవ్వుతారేమో'నంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవితో తాను సినిమా చేయాల్సి వస్తే కామెడీ సబ్జెక్టును ఎంచుకుంటానని చెప్పారు. కాగా, గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఛాలెంజ్, అభిలాష, ఖైదీ, రాక్షసుడు, విజేత వంటి పలు హిట్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.