: ఆరు నెలల్లో తెలంగాణకు సీఎంగా కేటీఆర్: పాల్వాయి జోస్యం
తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, మరో ఆరు నెలల్లో రాజీనామా చేసి కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించనున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి వ్యాఖ్యానించారు. ఆపై మరో ఏడాదికి ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని, ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారని జోస్యం చెప్పారు. 2019 వరకూ సీఎంగా ఉండి ఎన్నికలకు వెళితే, ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత గెలుపోటములను ప్రభావితం చేస్తుందన్న కారణంతోనే కేసీఆర్, తన కుమారుడిని సీఎం పదవిపై కూర్చోబెట్టాలని అనుకుంటున్నారని, ఈ విషయంపై టీఆర్ఎస్ నేతల్లో చర్చ జరుగుతోందని పాల్వాయి తెలిపారు. కేవలం ప్రచారం కోసమే హరితహారం కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించారని విమర్శించారు.