: నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్... ఏపీలో కూడా!
నేడు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా మేఘాలు ఆవరించి ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలపై రుతుపవనాల ప్రభావం అధికంగా ఉందని, ఈ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవచ్చని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు.