: చిత్తూరు జడ్పీ సమావేశం రసాభాస... టీడీపీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన రోజా!


చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. రైతు రుణమాఫీపై టీడీపీ ఎమ్మెల్యే శంకర్ తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా, నారాయణస్వామి వాగ్వాదానికి దిగారు. నగరి నియోజకవర్గంలో రైతు రుణమాఫీ జరిగిందని నిరూపించాలని ఆమె శంకర్ కు సవాల్ విసిరారు. కేవలం టీడీపీ వారికి తప్ప ఇతరులకు రుణమాఫీ జరగలేదని రోజా తెలిపారు. టీడీపీకి చెందిన వారే రైతులా? ఇతరులు రైతులు కాదా? అని ఆమె ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు జిల్లా మంత్రితో అయినా, ఎమ్మెల్యేతో అయినా సరే తాను సిద్ధమని ఆమె ప్రకటించారు. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నామని, తామేం చేయాలనుకుంటే అదే చేస్తామని, దమ్ము గురించి మాట్లాడవద్దని, రుణమాఫీ జరిగిన వారంతా రైతులేనని వారు తెలిపారు. దీంతో సమావేశం సవాళ్లు, ప్రతి సవాళ్లతో దద్దరిల్లింది. దీంతో సమావేశాన్ని రద్దు చేసి, వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News