: పోలీసు బాసు ఇంట్లో అడ్డమైన చాకిరీ చేస్తున్న హోంగార్డులు!
హైదరాబాదులోని పోలీసు బాసు ఇంట్లో హోంగార్డులు చాకిరీ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. రంగారెడ్డి ఎస్పీ నివాసంలోని గేదెలకు గడ్డి వెయ్యడం, ఇంట్లో అంట్లు తోమడం, బట్టలు ఉతకడం వంటి పనులను హోం గార్డుల చేత చేయించడంపై సర్వత్ర చర్చ మొదలైంది. గతంలోనే పోలీస్ విభాగంలో సంప్రదాయంగా కొనసాగిన ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోలీసు బాసు ఇంట్లో సుమారు ఆరుగురు హోం గార్డులు ఇలా చాకిరీ చేయడం అందరికీ ఆగ్రహాన్ని రప్పిస్తోంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!