: సంప్రదాయాలు నా సినిమాల్లో ఉండేలా చూస్తుంటా: పవన్ కల్యాణ్
లండన్ లో జరుగుతున్న యూకేటీఏ (యుక్తా) ముగింపు ఉత్సవాల్లో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయాలను భావితరాలకు పంచేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతగానో దోహదం చేస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులతో పవన్ సమావేశమయ్యారు. తన సినిమాల్లో ఇలాంటి సంప్రదాయాలు ప్రతిబింబించేలా చూస్తానని ఆయన తెలిపారు. కాగా, ఇలాంటి సంప్రదాయాలను ప్రోత్సహించడంలో భాగంగా... తెలుగు ప్రాంతాల్లోని ఆయా యాసలకు సంబంధించిన జానపద పాటలను తన సినిమాల్లో అప్పుడప్పుడు పవన్ స్వయంగా పాడుతున్న సంగతి తెలిసిందే.