: రెండేళ్లుగా చేస్తున్న విష ప్రచారానికి వైఎస్సార్సీపీ ఇప్పుడు పేరు పెట్టుకుంది: ప్రత్తిపాటి
గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ చేస్తున్న విష ప్రచారానికి ఇప్పుడు ఒక పేరు పెట్టిందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, గడపగడపకు వెళ్లి వైఎస్సార్సీపీ అక్రమాస్తులపై ఏమని ప్రజలకు చెబుతారని అడిగారు. 'గడపగడపకు' పేరుతో టీడీపీపై వైఎస్సార్సీపీ విషప్రచారం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపగడపకు వెళ్లి జగన్ ఆస్తులు ఈడీ ఎలా అటాచ్ చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాలనే సమగ్ర సాధికారిక సర్వే చేపట్టామని ఆయన తెలిపారు.