: నెల్లూరు జిల్లాలో ఇంట్లో చొరబడి బీభత్సం సృష్టించిన దుండగుడు
నెల్లూరు జిల్లాలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. జిల్లాలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఓ ఆడిటర్ ఇంట్లోకి చొరబొడ్డ ఓ దుండగుడు ఇంట్లో ఉన్న ముగ్గురిని తీవ్రంగా గాయపరిచాడు. దాడికి గురయిన ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎట్టకేలకు ఆ వ్యక్తిని పట్టుకున్న కుటుంబ సభ్యులు స్థానికుల సాయంతో అతడిని పోలీసులకి అప్పగించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. దుండగుడు ఇంట్లో దోపిడీ చేయడానికి వచ్చాడా..? లేక మరే కారణంపై వచ్చాడా? అనే అంశంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.