: ప్రజాప్రతినిధులు ప్రలోభాలకు గురైన అంశాలను బయట పెడతా: పొంగులేటి సుధాకర్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీతో తెలంగాణలో జరుగుతోన్న పార్టీ ఫిరాయింపులపై వివరించినట్లు చెప్పారు. భూసేకరణ అంశాన్ని కూడా రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ చేపడుతోన్న ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోందని, ఈ చర్య సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు ప్రలోభాలకు గురైన అంశాలను త్వరలో బయట పెడతానని పొంగులేటి వ్యాఖ్యానించారు.