: ఢిల్లీ ఎయిర్ పోర్టు గడప దాటని చంద్రబాబు!... లాంజ్ లోనే అశోక్, సుజనాలతో చర్చలు!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ ఎయిర్ పోర్టులో రష్యా విమానం ఎక్కేశారు. నేటి ఉదయమే విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో ఢిల్లీ ఫ్లైటెక్కిన చంద్రబాబు 10 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. ఆ తర్వాత రష్యా విమానం టేకాఫ్ కు దాదాపుగా రెండు గంటల సమయమున్నా... చంద్రబాబు ఎయిర్ పోర్టు దాటి బయటకు రాలేదు. అయితే రష్యాలో కీలక పర్యటనకు వెళుతున్న చంద్రబాబుకు వీడ్కోలు పలికేందుకు టీడీపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు పూసపాటి అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఎయిర్ పోర్టుకు వచ్చారు. వారిద్దరితో విమానం ఎక్కేదాకా చర్చలు జరిపిన చంద్రబాబు సమయం కాగానే రష్యా ఫ్లైటెక్కేశారు.