: ఢిల్లీలో ల్యాండైన చంద్రబాబు... మరికాసేపట్లో రష్యా ఫ్లైటెక్కనున్న ఏపీ సీఎం
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. నేటి ఉదయం విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో విమానమెక్కిన ఆయన కాసేపటి క్రితం దేశ రాజధాని చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన రష్యా విమానం ఎక్కనున్నారు. రష్యా పర్యటన నిమిత్తమే ఆయన బయలుదేరినా... గన్నవరం నుంచి నేరుగా విమానం లేని కారణంగా ఢిల్లీ విమానం ఎక్కారు. మరికాసేపట్లో (11.45 గంటలకు) ఆయన ఢిల్లీ ఎయిర్ పోర్టులో రష్యా ఫ్లైట్ ఎక్కనున్నారు.