: జయంతి రోజే వైఎస్ కు అవమానం!... మహానేత చిత్రపటంపై చెప్పులు పడిన వైనం!


దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన జయంతి రోజే ఘోర అవమానం జరిగిపోయింది. వైసీపీలోని చెన్నై సేవాదళం నేతల మధ్య నెలకొన్న వివాదం దీనికి కారణమైంది. ఆధిపత్య పోరులో భాగంగా ఇరువర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు చెప్పులు, బూట్లతో కొట్టుకున్నారు. ఈ క్రమంలో వారు విసురుకున్న చెప్పులు ఏకంగా వైఎస్ చిత్రపటంపై పడినా వారు పట్టించుకున్న పాపాన పోలేదు. వివరాల్లోకెళితే... చెన్నై సేవాదళానికి ప్రస్తుతం సైకం రామచంద్రారెడ్డి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అయితే సైకంను ఇటీవలే ఆ పదవి నుంచి తొలగించారని, తనను ఆ పదవిలో నియమించారని లక్ష్మీశ్రీదేవిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న వైఎస్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించేందుకు చెన్నైలో ఏర్పాటైన కార్యక్రమంలో సైకం, శ్రీదేవిరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు ముష్టి ఘాతాలు విసురుకున్న అనంతరం చెప్పులు, బూట్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వారు విసిరిన చెప్పులు అక్కడే ఏర్పాటు చేసిన వైఎస్ చిత్రపటంపై పడ్డాయి. అయినా ఈ విషయాన్ని ఇరువర్గాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News