: సొంత ఫాంహౌజ్ పైనే హెలికాఫ్టర్ లో కేసీఆర్ చక్కర్లు!
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలో ఓ వ్యవసాయ క్షేత్రం(ఫాంహౌస్) ఉందన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం తీరిక దొరికినా ఆయన తన సొంతూరు చింతమడక కంటే అందులో సేద దీరేందుకు ఆసక్తి చూపుతారు. హైదరాబాదు నుంచి స్వల్ప వ్యవధిలో అక్కడికి చేరుకునే వీలుండటం, సాగుపై తనకున్న మమకారంతో అక్కడ కొనసాగుతున్న వ్యవసాయ పనులను పర్యవేక్షించేందుకే ఆయన అక్కడకు వెళతారు. తాజాగా నిన్న ఆయన తన సొంత ఫాంహౌస్ పైనే హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టారు. హైదరాబాదు నుంచి నల్లగొండకు బయలుదేరిన కేసీఆర్... తన హెలికాప్టర్ ను ఫాంహౌస్ వైపు మళ్లించారు. ఫాంహౌస్ చుట్టూ హెలికాప్టర్ లోనే రెండు రౌండ్లు వేసిన కేసీఆర్... ఆకాశం నుంచే తన పంటలను పరిశీలించి ఆ తర్వాత నల్లగొండకు వెళ్లిపోయారు.