: అక్టోబర్ లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో రెండు గంటలపాటు సాగిన తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ లో మోదీ పర్యటన తెలంగాణలో ఉంటుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు సెప్టెంబర్ లో తెలంగాణకు వస్తారని చెప్పారు. తెలంగాణలో పార్టీ బలోపేతం అంశంతో పాటు ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజాందోళనలు చేపట్టాలని కోర్ కమిటీలో నిర్ణయించడం జరిగిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు పార్టీ అధిష్ఠానం గుర్తించిందని లక్ష్మణ్ పేర్కొన్నారు.