: బురఖా ధరిస్తే భారీ జరిమానా... స్విస్ రాష్ట్రంలో కొత్త నిబంధన!


ప్రపంచ పర్యాటక క్షేత్రం స్విట్జర్లాండ్ లోని టిసినోలో బురఖాపై నిషేధం విధించారు. స్విస్ ఆగ్నేయ రాష్ట్రమైన టిసినోలో బురఖాలపై కొత్త చట్టం చేశారు. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ భవనాల్లో బురఖా ధరించకూడదు. యూరోప్ మొత్తం ఉగ్రదాడులతో అట్టుడుకుతున్న వేళ స్విస్ లో ఈ చట్టం ఆసక్తి రేపుతోంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే...సుమారు 7,800 రూపాయల నుంచి 7.85 లక్షల రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. టిసినోతో పాటు లుగానో, లొకార్నో, మగదినో, బెల్లింజోన, మెండ్రిసియో ప్రాంతాల్లో ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయం తమ దేశ పర్యాటకులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. టిసినో ప్రభుత్వ ఉత్తర్వుల గురించి వెల్లడించింది. ఇలాంటి చట్టాన్ని రాష్ట్రం రూపొందించడం తప్పుకాదని స్విస్ పార్లమెంటు దీనిని ఆమోదించింది. ఈ చట్టంపై రెఫరెండంను 2013 లోనే టిసినో ప్రభుత్వం నిర్వహించింది. మూడింట రెండు వంతుల మంది ఓటర్లు బురఖా, నిఖాబ్ ల నిషేధానికి అనుకూలంగా ఓటు వేశారు.

  • Loading...

More Telugu News