: ఏపీ సర్కార్ కు భూ దాహం తీరట్లేదు: కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి
ఏపీ సర్కార్ కు భూ దాహం తీరట్లేదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఒక టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, మరో లక్ష ఎకరాలపై ఏపీ సర్కార్ కన్నేసిందని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో లక్ష ఎకరాల భూ సమీకరణకు కసరత్తు చేస్తోందని, మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీకి ఈ బాధ్యతలను అప్పగించిందని, 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణకు నిర్ణయం తీసుకుందని అన్నారు. బందరు పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమల కోసమే ఈ భూ సమీకరణ అంటున్న ప్రభుత్వం వ్యాఖ్యలతో పోర్టు పరిధిలోని గ్రామాల ప్రజల్లో కలవరం మొదలైందని రఘువీరారెడ్డి అన్నారు.