: బాలీవుడ్ నిర్మాత మేనల్లుడిపై రేప్ కేసు
బాలీవుడ్ నిర్మాత మేనల్లుడిపై రేప్ కేసు నమోదైందని ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ, బాధితురాలు నిందితుడి భార్యేనని వారు తెలిపారు. మేనమామకు చెందిన ప్రొడక్షన్ హౌస్ కు నిందితుడు ఇన్ఛార్జీగా పని చేస్తున్నాడని వారు వెల్లడించారు. తన నగలన్నీ తీసుకుని భర్త వేధిస్తున్నాడని, వెనక్కి ఇవ్వమంటే ఇవ్వడం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొందని వారు చెప్పారు. తన అభీష్టానికి వ్యతిరేకంగా లైంగికంగా ఇబ్బంది పెడుతున్నాడని ఆమె తెలిపిందని, దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వారు వెల్లడించారు. కాగా, బాధితురాలు, నిందితుడి పేర్లు వెల్లడించేందుకు పోలీసులు ఇష్టడపడకపోవడం విశేషం.