: హార్దిక్ పటేల్ కు దేశద్రోహం కేసులో బెయిలు... 'ఆరు నెలలు గుజరాత్ లో వుండకూడదు' అన్న షరతు!


గుజరాత్ లో పటేల్ ఉద్యమానికి నేతృత్వం వహించిన యువ నేతగా అనతికాలంలోనే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హార్దిక్ పటేల్ పై నమోదైన దేశద్రోహం కేసులో ఎట్టకేలకు తొమ్మిది నెలల తరువాత బెయిల్ లభించింది. ఈ మధ్యాహ్నం హార్దిక్ కు బెయిలిచ్చిన హైకోర్టు, అతను జైలు నుంచి విడుదలైన తరువాతఆరు నెలల పాటు గుజరాత్ రాష్ట్రాన్ని వీడి పోవాలని తీర్పిచ్చింది. కాగా, ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ హార్దిక్ జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి లేదు. మరో కేసులో ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారం జరగనుంది. ఇక ఆ కేసులో కూడా బెయిలు వస్తే, యువనేత జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమవుతుంది. కాగా, అధికార బీజేపీకి వ్యతిరేకంగా పటీదార్ వర్గాన్ని రెచ్చగొట్టాడని, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని, పోలీసులను హతమార్చాలని యువతకు నూరిపోశాడని ఆయనపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పబ్లిక్ మీటింగుల్లో మారణాయుధాలను ప్రదర్శించాడని కూడా హార్దిక్ పై కేసు నమోదైంది. తొమ్మిది నెలల క్రితం హార్దిక్ మద్దతుదారులు గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించిన సంగతి విదితమే. పటీదార్ వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది హార్దిక్ ప్రధాన డిమాండు.

  • Loading...

More Telugu News