: 'అంబికా' డైరెక్టర్ కు బెదిరింపులు... నకిలీ నక్సల్స్ అరెస్ట్!


అంబికా దర్బారు బత్తితో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అంబికా గ్రూప్ సంస్థల డైరెక్టర్ అంబికా ప్రసాద్ ను నకిలీ నక్సలైట్లు బెదిరించిన ఘటన ఏలూరులో కలకలం రేపింది. ఆయనకు ఫోన్ చేసిన నకిలీ నక్సల్స్ తమకు తక్షణం రూ. 50 లక్షలు ఇవ్వాలని, లేకుంటే హతమారుస్తామని హెచ్చరించారు. ఈ సమాచారాన్ని ప్రసాద్, పోలీసులకు చేరవేయగా, వెంటనే స్పందించిన పోలీసులు ఆ నకిలీ నక్సలైట్లను వలపన్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓ కారుతో పాటు తుపాకిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. మొత్తం ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News