: మణిపూర్ లో 1528 నకిలీ ఎన్ కౌంటర్లు... విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం


ఈశాన్య మణిపూర్ రాష్ట్ర పరిధిలో సైన్యం, ఇతర భద్రతా దళాలు 1528 ఫేక్ ఎన్ కౌంటర్లు చేసి వందలాది మంది అమాయకుల ప్రాణాలను హరించారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్మీ స్వయంగా విచారించి నివేదికను తమకు ఇవ్వాలని తెలిపింది. ప్రత్యేక అధికారాలున్న ఆర్మీ దళాలు, తమ ఇష్టానుసారం అమాయకుల ప్రాణాలు తీశాయని మానవ హక్కుల సంఘాలు పిటిషనర్ల రూపంలో కోర్టును ఆశ్రయించగా, కోర్టు దీనిపై విచారణ చేపట్టింది. ఇదే సమయంలో జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ 'కోరలు లేని పెద్దపులి'లా తమ పరిస్థితి ఉందని, తమకు మరిన్ని అధికారాలు కావాలని కోర్టును కోరగా, పరిశీలించేందుకు కోర్టు అంగీకరించింది. ప్రాథమిక దర్యాఫ్తులో ఆరు ఎన్ కౌంటర్లు నకిలీవేనని ధ్రువపడిన నేపథ్యంలో అన్నింటిపైనా విచారించాలని కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News