: చంద్రబాబుకు నిజం తెలిసిరావాలి: జగన్ నిప్పులు


చంద్రబాబునాయుడు ఇచ్చిన అబద్ధపు హామీలతో ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, ప్రజలను మోసం చేస్తే ఏం జరుగుతుందన్న నిజం ఆయనకు తెలిసి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవని వైకాపా అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఆయన 'గడప గడపకూ వైసీపీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోసం చేసే నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వయంగా నిలదీయకుంటే, చంద్రబాబు సర్కారు మోసాలు ఇక్కడితో ఆగవని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకూ ప్రజా బ్యాలెట్ ను పంపిణీ చేసి వారి స్పందనను సేకరిస్తామని, వాటి ద్వారా బాబు మోసాలను బయటపెడతామని జగన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News