: జ‌కీర్‌తో క‌లిసి శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్ పాల్గొన లేదా..?: డిగ్గీ రాజా సూటి ప్రశ్న


ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ తో తనకున్న సంబంధాలపై మీడియాలో వస్తున్న వార్తలపై, బీజేపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి స్పందించారు. ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జ‌కీర్‌తో క‌లిసి వేదిక‌పై శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్ పాల్గొన లేదా..? అని ప్రశ్నించారు. జ‌కీర్ నాయ‌క్‌తో వేదిక‌ను నేను మాత్ర‌మే పంచుకున్నానా..? అని ఆయన ప్రశ్నించారు. ర‌విశంకర్‌ది దేశ భ‌క్తి, నేను దేశ ద్రోహినా..? అని ఆయన నిలదీశారు. జకీర్ నాయక్ తో ఓ వేదికపై పాల్గొని ఆ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ ఆయనను శాంతిదూతగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆయనపై పలు విమర్శలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News