: ప్రత్యేక బస్సులో చౌటుప్పల్ చేరుకున్న కేసీఆర్.. మార్కెట్ యార్డులో మొక్కను నాటిన సీఎం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలో ప్రారంభించారు. ప్రత్యేక బస్సులో చౌటుప్పల్ చేరుకున్న కేసీఆర్‌కి తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడి మార్కెట్ యార్డులో కేసీఆర్ మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం యార్డులో నూతన గోదామును ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో అధికారులు మొక్కలు నాటే పనిలో మునిగిపోయారు.