: వీడియో షూటింగ్ కోసం గంగలో దూకి మాయమైన యువకుడు!


స్నేహితుల వీడియో కోసం గంగా నదిలో దూకిన యువకుడు గల్లంతైన విషాదకర సంఘటన హరిద్వార్ లో జరిగింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియో వెనకున్న మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆశిష్ చుహాన్ (27) హరిద్వార్ సమీపంలోని గంధ్ మీర్ పూర్ నివాసి. గంగా కెనాల్ దగ్గరకు తన స్నేహితులతో కలసి వచ్చాడు. అప్పటికే వీరంతా పూటుగా తాగి ఉన్నారు. తాము మొబైల్ ఫోన్లలో వీడియో తీసుకుంటామని, నదిలోకి దూకాలని స్నేహితులంతా ఆశిష్ ను కోరారు. తొలుత తటపటాయించినా, వారి బలవంతం మేరకు నదిలోకి దూకాడు. దూకిన తరువాత ఎంత సేపటికీ పైకి తేలలేదు. దీంతో ఆందోళనకు గురైన మిత్రబృందం కాసేపు వెతికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక వీరు తీసిన వీడియోను కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలో ఇది షేర్ల మీద షేర్ లు తెచ్చుకుంటోంది. గంగా కెనాల్ లో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున ఆశిష్ కొట్టుకుపోయి ఉంటాడని భద్రాబాద్ పోలీసు అధికారులు వివరించారు. ఇదో దురదృష్టకర ప్రమాద ఘటనని, ఎవరిపైనా కేసులు పెట్టలేమని అన్నారు.

  • Loading...

More Telugu News