: ఫడ్నవీస్ జట్టులో మరో 11 మంది... డుమ్మా కొట్టిన శివసేన అధినేత


మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా మరో 11 మందిని క్యాబినెట్ లోకి తీసుకోగా, బీజేపీకి ప్రధాన మిత్రపక్షంగా ఉన్న శివసేన నుంచి ఇద్దరికి చోటు లభించింది. కనీసం నలుగురి నుంచి ఐదుగురు తమవారికి స్థానం లభిస్తుందని భావించిన శివసేన, ఫడ్నవీస్ నిర్ణయంతో అసంతృప్తిని వ్యక్తం చేసింది. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే రాలేదు. విధాన్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ విద్యాసాగర్ రావు కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఇప్పటివరకూ హోం శాఖ సహాయమంత్రిగా ఉన్న రామ్ షిండేకు ఫడ్నవీస్ ప్రమోషన్ ఇచ్చారు. శివసేన ఎమ్మెల్యేలు అర్జున్ ఖోట్కర్ (జల్నా), గులాబ్ రావ్ పాటిల్ (జల్ గావ్)లను జూనియర్ మంత్రులుగా తీసుకున్నారు. వీరితో పాటు స్వాభిమాన్ పార్టీకి చెందిన సదబాహు ఖోట్, రాష్ట్రీయ సమాజ్ పార్టీకి చెందిన మహాదేవ్ జాంకర్ లూ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక బీజేపీకి చెందిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగ ఫుండ్ కర్, జయకుమార్ రావల్ (దోండీచా), శంభాజీ పాటిల్ నిలంగేకర్ (నిలంగా), సుభాష్ దేశ్ ముఖ్ (సోలాపూర్) లు క్యాబినెట్ మంత్రులుగా, రవీంద్ర చావన్, మదన్ యరావర్ లు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News