: వైకాపాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు... ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కొట్టివేత


తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. తమ పార్టీ టికెట్ పై గెలిచి, ఆపై తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వైకాపా వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం తోసిపుచ్చింది. ఈ కేసులోని విషయాలు స్పీకర్ పరిధిలో ఉంటాయని గుర్తు చేసిన ధర్మాసనం, తొలుత హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. కేసు విచారణను హైకోర్టు త్వరగానే పూర్తి చేస్తుందని తాము నమ్ముతున్నందున, హైకోర్టుకు కూడా ఎలాంటి ఆదేశాలూ ఇవ్వబోవడం లేదని పేర్కొంది.

  • Loading...

More Telugu News