: అమెరికాలో హింసాత్మకంగా మారిన ఆందోళనలు
అమెరికాలో నల్లజాతీయులపై పోలీసుల కాల్పులకు నిరసనగా నల్లజాతీయులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టెక్సాస్‌లోని డాలస్‌లో ఆందోళనకారులు కాల్పులు జరపడంతో నలుగురు పోలీసులు మృతి చెందారు. కాల్పులకు పాల్పడిన ఓ వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో నల్లజాతీయులను పోలీసులు కాల్చి చంపడంపై అక్కడ నిరసనలు వెల్లువెత్తున్నాయి. మిన్నెసోటా, లూసియానాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నల్లజాతి యువకులపై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డల్లాస్‌లో నిన్న అధిక సంఖ్యలో నల్లజాతీయులు ర్యాలీ నిర్వహించారు. నేడు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి.