: లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి, ధోనీ గెలిపించిన మ్యాచ్ లు... ఆసక్తికర అంశాలు!


మహేంద్ర సింగ్ ధోనీ... 35వ పుట్టిన రోజు జరుపుకున్న స్టార్ క్రికెటర్. తన 12 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. గొప్ప వికెట్ కీపర్ - బ్యాట్స్ మెన్ లలో ఒకరిగా నిలిచాడు. ఆయన నాయకత్వంలో భారత్ వన్డే క్రికెట్ చరిత్రలో అద్భుత విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో ధోనీ సాధించిన కొన్ని రికార్డులు ఓసారి గుర్తు చేసుకుంటే... 224- టెస్టుల్లో ఓ భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక పరుగులివి. ఆల్ టైం క్రికెట్ హిస్టరీలో ఇది సెకండ్ బెస్ట్. ఈ ఫీట్ ను 2013లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధోనీ సాధించాడు. ధోనీ కన్నా ముందున్నది ఆండీ ఫ్లవర్ ఒక్కడే. ఆండీ నాగపూర్ లో ఇండియాతో జరిగిన మ్యాచ్ లో 232 పరుగులు చేశాడు. 183- ధోనీ బ్యాటు సత్తా ఏంటో అందరికీ చూపిన ఇన్నింగ్స్ ఇది. 2005లో జైపూర్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 15 ఫోర్లు, 10 సిక్సుల సాయంతో ఈ స్కోరు చేశాడు. ప్రపంచ వన్డే చరిత్రలో ఓ వికెట్ కీపర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. 107- పరిమిత ఓవర్ల పోటీల్లో ధోనీ సాధించిన విజయాలివి. ధోనీ కన్నా ముందు 165 విజయాలతో రికీ పాంటింగ్ ఒక్కడే ఉన్నాడు. మొత్తం 194 వన్డేలకు ధోనీ నాయకత్వం వహించగా, 107 సార్లు గెలుపు తీరాలకు భారత జట్టు చేరుకుంది. 3- అన్ని ఐసీసీ చాంపియన్ షిప్ పోటీలనూ ఓ కెప్టెన్ గా గెలుచుకున్న ఏకైక వ్యక్తి ధోనీయే. 2007లో ఐసీసీ వరల్డ్ టీ20, 2011లో ఐసీసీ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలు ఆయన నాయకత్వంలో భారత్ ఒడిసిపట్టింది. 9- ధోనీ మంచి మ్యాచ్ ఫినిషర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తన కెరీర్ లో ఇప్పటివరకూ 9 సార్లు చివరి బంతికి సిక్స్ బాది జట్టును గెలిపించాడు ధోనీ. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ ఘనతనూ మరెవరూ సాధించలేదు. 148- ధోనీ చేసిన తొలి భారీ స్కోరు. తానాడుతున్న ఐదవ వన్డేలో పాకిస్థాన్ పై ఈ స్కోరును ధోనీ చేసి క్రీడాభిమానుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు.

  • Loading...

More Telugu News