: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన 'ఆప్' ఎమ్మెల్యే... ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు


ఢిల్లీలో పాలక పక్ష ఎమ్మెల్యేలపై కేసులు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా కేసుల్లో పలువురు ఎమ్మెల్యేలు చిక్కుకోగా, తాజాగా దేవ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్ పై వేధింపుల కేసు నమోదైంది. గతంలో మహిళా అధికారిపై చెయ్యి చేసుకుని ఓసారి అరెస్టయిన ప్రకాశ్ పై ఈ దఫా ఓ మహిళ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ, గ్రేటర్ కైలాశ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీన్ని స్వీకరించిన పోలీసులు భారత శిక్షాస్మృతిలోని 354, 506, 509 మరియు 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా బాధితురాలి వివరాలు వెల్లడించబోమని స్పష్టం చేసిన పోలీసులు, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఇటీవల మరో ఎమ్మెల్యే దినేశ్ మోహానియా సైతం మహిళల పట్ల వేధింపుల కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News