: మహానేతకు ఘన నివాళులు... ఇడుపులపాయకు అభిమానుల బారులు!
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ ఉదయం అసంఖ్యాకమైన వైఎస్ఆర్ అభిమానులు ఇడుపులపాయకు బారులుదీరగా, పార్టీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఆయన వెంట భార్య భారతి, వైఎస్ సతీమణి విజయమ్మ, బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల తదితరులు ఉన్నారు. తన తండ్రి ఆశయ సాధనకు జీవితాంతం కృషి చేస్తానని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. అనంతరం స్మృతిచిహ్నం వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తదితర నేతలు ఏర్పాట్లు పర్యవేక్షించారు.