: రెండేళ్ల పాలన, సంక్షేమ పథకాలపై చర్చ!... కాసేపట్లో ఏపీ కేబినెట్ కీలక భేటీ!
రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో ఏర్పడ్డ నవ్యాంధ్రప్రదేశ్ పాలనను చేపట్టిన టీడీపీ... ఇప్పటికే రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్లలో గతంలో ఎన్నడూ లేనంత రీతిలో పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చే ప్రధాన అజెండాగా చంద్రబాబు కేబినెట్ నేటి ఉదయం విజయవాడలో ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ రెండు అంశాలతో పాటు నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం, స్విస్ చాలెంజ్ పధ్ధతికి సీఆర్డీఏ ఆమోదం తెలిపిన అంశంపైనా కేబినెట్ దృష్టి సారించనున్నట్లు సమాచారం.