: ప్రయాణికులను వదిలేసి వెళ్లిన ఇండిగో ఫ్లైట్!... శంషాబాదు ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన!


ఇండిగో ఎయిర్ వేస్ సంస్థకు చెందిన విమానాలు హైదరాబాదు ప్రయాణికులను నానా తిప్పలు పెడుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు టికెట్లు కొని ప్రయాణం కోసం శంషాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులను వదిలేసి వెళ్లిన ఆ ఫ్లైట్లు పలు విమర్శలు ఎదుర్కొన్నాయి. తాజాగా అలాంటి ఘటనే నేటి ఉదయం మరోమారు చోటుచేసుకుంది. ఢిల్లీ వెళ్లేందుకు 25 మంది హైదరాబాదీలు లగేజీ సర్దేసుకుని నేటి ఉదయం ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయితే వారిని ఎక్కించుకుని టేకాఫ్ తీసుకోవాల్సిన విమానం... వారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ప్రయాణికులు షాక్ తిన్నారు. ఏం చేయాలో పాలుపోక... అక్కడే ఆందోళనకు దిగారు. దీనిపై అటు ఇండిగో ఎయిర్ వేస్ కానీ, శంషాబాదు ఎయిర్ పోర్టు సిబ్బంది కానీ పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News