: అమిత్ షాను కలవనున్న కంభంపాటి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు రేపు సమావేశం కానున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక గురించి చర్చించే అవకాశం లేదని అన్నారు. రాష్ట్రంలో 80 శాతం మండల కమిటీలు, 60 శాతం గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి చేశామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 2 లక్షలున్న సభ్యత్వాలను 26 లక్షలకు తీసుకువెళ్లామని అన్నారు. అలాగే రేపటి భేటీలో అమిత్ షాతో ప్రస్తావించే అంశాలపై కోర్ కమిటీ సమావేశంలో చర్చించామని, అభివృద్ధి కార్యక్రమాలను సీడీ రూపంలో తయారుచేశామని ఆయన అన్నారు.