: హైదరాబాదులో పట్టుబడ్డ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను కలుసుకున్న కుటుంబ సభ్యులు


హైదరాబాదులో విధ్వంసానికి కుట్ర పన్ని ఎన్ఐఏ అధికారులకు పట్టుబడ్డ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను వారి కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ముస్లింల పవిత్ర రంజాన్‌ ను పురస్కరించుకుని అధికారులు వారికి కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశం కల్పించారు. ఎన్ఐఏ కస్టడీలో ఉన్న ఉగ్రవాదుల విచారణకు రంజాన్ సందర్భంగా విరామమిచ్చారు. ఇద్దరేసి కుటుంబ సభ్యుల వంతున వారిని కలిసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. యువకుల మనోభావాలను గౌరవించి వారిని కుటుంబ సభ్యులతో కలిసే అవకాశం కల్పించామని చెప్పిన అధికారులు, కుటుంబసభ్యులు తీసుకొచ్చిన ఆహార పదార్థాలను అనుమతించ లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు కోరిన ఆహార పదార్థాలను తామే తయారుచేయించామని చెప్పారు. రేపటి నుంచి విచారణ యథాతథంగా జరుగుతుందని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News