: నిలోఫర్ ఆసుపత్రిలోని సెలైన్ బాటిళ్లలోనూ బ్యాక్టీరియా


హైదరాబాద్ లోని నిలోఫర్ పిల్లల ఆసుపత్రిలోనూ బ్యాక్టీరియా సెలైన్ బాటిళ్లు ఉన్నట్లు డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ సందర్భంగా డ్రగ్ ఇన్ స్పెక్టర్ పావని మాట్లాడుతూ, ఈరోజు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించగా 29 వేల సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా ఆనవాళ్లున్న విషయం బయటపడిందన్నారు. వాటిని సీజ్ చేశామని, వాటి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపిస్తామని చెప్పారు. కాగా, సరోజినీ దేవీ కంటి ఆసుపత్రిలో నిన్న జరిగిన సంఘటన నేపథ్యంలోనే ఈ తనిఖీలు జరిగాయి. బ్యాక్టీరియా ఉన్న సెలైన్ బాటిళ్లను సరఫరా చేసిన సదరు కంపెనీని బ్లాక్ లిస్టులో ఉంచారు. ఆ కంపెనీ సరఫరా చేసే అన్ని ఆస్పత్రుల్లోనూ డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News