: 'పీస్' టీవీ ప్రసారాలను, నాయక్ బోధనలను ప్రభుత్వం తక్షణం నిషేధించాలి!: ముస్లిం పర్సనల్ లా బోర్డు
ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత షియా పర్సనల్ లా బోర్డు భారత ప్రభుత్వానికి సూచించింది. లక్నోలో ఈ మేరకు ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికార ప్రతినిధి మౌలానా యసూబ్ అబ్బాస్ మాట్లాడుతూ, జకీర్ నాయక్ బోధనలపై తక్షణమే నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ జకీర్ వివాదాస్పద ప్రకటనలు చేయడమేంటని మౌలానా యసూబ్ నిలదీశారు. భారత ప్రభుత్వం తక్షణం పీస్ టీవీ ప్రసారాలను, నాయక్ బోధనలను నిషేధించాలని అన్నారు. అలాగే పీస్ టీవీకి సౌదీ అరేబియా, ఇతర ముస్లిం దేశాల నుంచి అందుతున్న నిధులపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.