: రవిశాస్త్రిని బ్యాటింగ్ కోచ్ గా ఉండమన్నాము... ఆయన ఒప్పుకోలేదు!: సౌరవ్ గంగూలీ


టీమిండియా హెడ్ కోచ్ పదవి తనకు దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న రవిశాస్త్రికి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా సలహాదారు కమిటీ సభ్యుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై రవిశాస్త్రి పలు వ్యాఖ్యలు చేయడం, దానికి గంగూలీ తనదైన శైలిలో సమాధానం చెప్పడం తెలిసిందే. తాజాగా, రవిశాస్త్రిపై గంగూలీ వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ హెడ్ కోచ్ కావాలని రవిశాస్త్రి అనుకున్నారని, బ్యాటింగ్ కోచ్ గా ఉండాలని తాము కోరామని, అందుకు ఆయన అంగీకరించలేదని చెప్పాడు. తనకంటే జూనియర్ అయిన అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ గా ఉంటే తాను బ్యాటింగ్ కోచ్ గా ఉండటం రవిశాస్త్రికి ఇష్టం లేకనే ఆ పదవి వద్దన్నాడంటూ గంగూలీ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News