: 48 ఏళ్ల వయసులో క్యాచ్ పట్టి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన నాసిర్ హుస్సేన్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ 48 ఏళ్ల వయసులో అద్భుతమైన క్యాచ్ పట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో బ్యాట్ కేమ్ డ్రోన్ 120 అడుగుల ఎత్తు నుంచి వదిలిన బంతిని ఒడిసిపట్టుకుని రికార్డు దిశగా సాగాడు. అయితే ఆ క్యాచ్ శాటిసిఫేక్షన్ ఇవ్వకపోవడంతో డ్రోన్ ను మరింత ఎత్తు నుంచి బంతిని విడుదల చేయాల్సిందిగా కోరాడు. దీంతో డ్రోన్ ను 150 అడుగుల ఎత్తుకు పంపి అక్కడి నుంచి బంతిని వదిలారు. చేతికి గ్లోవ్స్ ధరించి సిద్ధంగా ఉన్న నాసిర్ హుస్సేన్ దానిని ఒడిసి పట్టేసి ప్రపంచ రికార్డును చుట్టేశాడు. మూడో ప్రయత్నంగా 400 అడుగుల ఎత్తు నుంచి బంతిని వదలమని చెప్పిన నాసిర్ హుస్సేన్ దానిని పట్టుకోలేకపోయాడు. బంతి ఎత్తు నుంచి కిందపడే కొద్దీ దిశమార్చుకుంటుంది. దీంతో క్యాచ్ పట్టుకోవడం చాలా కష్టం. ఎత్తు పెరిగే కొద్దీ బంతి వేగం, దిశ మారుతుంటాయి. అలాంటి బంతిని పట్టుకోవడమంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి నాసిర్ హుస్సేన్ రికార్డు నెలకొల్పాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన హుస్సేన్ ప్రస్తుతం టీవీ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.