: డబ్బు, ఉద్యోగాలు వద్దేవద్దు...మా రెక్కల కష్టం మీద మేం బతుకుతాం: పొలాకి వాసులు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించే రాయితీలు, పునరావాస పథకాల ద్వారా లభించే డబ్బు తమకు వద్దేవద్దని శ్రీకాకుళం జిల్లా పొలాకి వాసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అవసరమైన భూసేకరణ కొలతలు తీసుకునేందుకు సర్వేయర్లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించే సేకరణ చట్టం తమకు ఆమోదయోగ్యం కాదని తెలిపారు. తాము భూములిచ్చేందుకు సిద్ధంగా లేమని అన్నారు. ఉన్న భూమినే సాగుచేసుకుని బతుకుతామని చెప్పారు. ఇంకా బతకడం కష్టమైతే పక్కఊరికి వెళ్లి సిమెంటు పని చేసుకుని బతుకీడుస్తామని చెప్పారు. తమకు ఉద్యోగావకాశాలు కూడా వద్దని వారు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు ఉద్యోగాలు చేసి తాము బతకలేదని, భూమాతను నమ్ముకుని బతికామని, ఇకపై కూడా అలా బతకడం తమకు కష్టం కాదని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News