: డబ్ల్యూటీసీ కూల్చిన ల్యాండింగ్ గేర్ దొరికింది
9/11 నాడు .. ప్రపంచ ట్రేడ్‌సెంటర్ భవనాలను ఉగ్రవాదులు విమానాలతో కూల్చివేసిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ఈ దుర్ఘటన ప్రాంతం ఇప్పుడు గ్రౌండ్ జీరోగా చెలామణీలో ఉంది. అయితే ఈ ట్విన్‌టవర్స్‌ను కూల్చిన విమానాల్లో ఒకదానికి చెందిన ల్యాండింగ్ గేర్ ఒకటి.. శుక్రవారం నాడు గ్రౌండ్‌జీరో సమీపంలో దొరికింది. 2001లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంటే.. దాదాపు పుష్కరం తర్వాత అప్పటి విమానపు అవశేషం బయల్పడింది.
గ్రౌండ్‌జీరో సమీపంలో ఒక 'ఇస్లాం కేంద్రం' నిర్మించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే వివాదం రేగుతుండగా... ఆ స్థలంలో సర్వే చేస్తున్నప్పుడు తుప్పుపట్టిన ల్యాండింగ్ గేర్ బయటపడింది. బోయింగ్ కంపెనీకి చెందినదిగా.. 9/11 దాడుల విమానానికే చెందినదిగా దీన్ని గుర్తించారు. ఇది దొరకడం వలన ఆనాటి బాధాకర స్మృతులన్నీ మళ్లీ గుర్తుకు వస్తున్నాయని న్యూయార్క్ పోలీసులు అంటున్నారు.