: నిమ్మకూరులో వెయ్యికోట్లతో 'బెల్' ప్లాంటు... శంకుస్థాపనకు వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా నిమ్మకూరులో బీఈఎల్ (బెల్) పరిశ్రమ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. నైట్ విజన్ పరికరాల తయారీ యూనిట్ ను ఇక్కడ నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. వెయ్యికోట్ల రూపాయలతో ఈ పరిశ్రమను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్లాంటు శంకుస్థాపనకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును 'బెల్' అధికారులు ఆహ్వానించారు.