: లీటరు కిరోసిన్ ధరను రూపాయి పెంచితే రూ. 700 కోట్లు మిగులుతాయి: ఓఎన్జీసీ


ప్రజలకు సబ్సిడీపై కిరోసిన్ ను అందిస్తున్న కేంద్రం ఏ మాత్రం ధరలు పెంచినా, ఓఎన్జీసీ వంటి చమురు సంస్థలు లబ్ధిని పొందుతాయని సంస్థ ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, "లీటరు కిరోసిన్ ధర ఒక్క రూపాయి పెంచినా చాలు. మొత్తం వ్యవస్థపై రూ. 700 కోట్ల భారం తగ్గుతుంది" అని అన్నారు. 2016 ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ రూ. 1,096 కోట్ల కిరోసిన్ సబ్సిడీని భరించిందని తెలిపారు. ప్రస్తుతం బ్యారల్ క్రూడాయిల్ నికర సరాసరి 45 నుంచి 47 డాలర్ల మధ్య కదలాడుతోందని తెలిపిన శ్రీనివాసన్, సమీప భవిష్యత్తులో రూ. 30 వేల కోట్ల మూలధనం ఖర్చుతో అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయనుందని వివరించారు.

  • Loading...

More Telugu News